- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భద్రతపై డీజీపీ, టీటీడీ ఈవో ఉన్నతస్థాయి సమీక్ష
తిరుమలలో భద్రతపై డీజీపీ, టీటీడీ ఈవో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భద్రతపై సమీక్ష నిర్వహించారు.

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో భద్రతపై డీజీపీ, టీటీడీ ఈవో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భద్రతపై సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని మెరుగైన భద్రతావ వ్యవస్థ ఏర్పాటు చేయడం అవసరం అని డీజీపీ అన్నారు. ఇదిలా ఉంటే పహెల్గామ్ ఎటాక్ తరవాత ఇండియా పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. దేశంలో కొంతమంది స్లీపర్ సెల్స్‌ను ఇంటిలిజెన్స్ అధికారులు గుర్తించారు. విశాఖలోనూ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేశారు. మరోవైపు ఇటీవల తిరుమలలో అన్యమతస్థుడు ప్రార్థన చేశాడు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ప్రతిరోజూ వేల మంది భక్తులు వచ్చే తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు.
Next Story






