- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్‌చల్.. ఆందోళనలో భక్తులు
తిరుమల(Tirumala) కొండపై మళ్లీ ఏనుగులు హల్‌చల్ చేశాయి.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) కొండపై మరోసారి ఏనుగులు హల్‌చల్ చేశాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద నిన్న(గురువారం) రాత్రి ఏనుగుల గుంపు సంచారం కలకలం సృష్టించింది. దీంతో భక్తులు(Devotees), వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ గుంపులో నాలుగు ఏనుగులు(Elephant), ఒక గున్న ఏనుగు ఉన్నాయి. ఘాట్ రోడ్డు పక్కన ఏనుగుల గుంపు హల్‌చల్ చేయడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
అటుగా వెళుతున్న కొంతమంది యువకులు గజరాజులను వెనక్కి పంపేందుకు గట్టిగా అరుపులు కేకలతో అరవడం ప్రారంభించారు. ఈ క్రమంలో సమాచారం మేరకు అటవీ శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని ఏనుగులను తిరిగి అడవిలోకి మళ్లించారు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా శేషాచలం అడవుల్లోని ఏనుగులను అడవుల్లోకి తరిమేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ, ప్రతి రోజు ఏదో ప్రాంతంలో దాడులు చేస్తుండడంతో స్థానికులు భయపడుతున్నారు.






