వినాయకచవితి ఎఫెక్ట్.. తిరుమలలో భక్తు రద్దీ ఎలా ఉందంటే..

by Naga Rani Yarlagadda |

ప్రతిరోజూ భక్తులతో కిటకిటలాడుతుంటాయి తిరుమల గిరులు. వినాయకచవితి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది.

వినాయకచవితి ఎఫెక్ట్.. తిరుమలలో భక్తు రద్దీ ఎలా ఉందంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిరోజూ భక్తులతో కిటకిటలాడుతుంటాయి తిరుమల గిరులు. వినాయకచవితి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది. శ్రీవారి సర్వదర్శనం కోసం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని పేర్కొంది. టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 3-5 గంటల సమయం, రూ.300 శీఘ్రదర్శనానికి 1-3 గంటల సమయం పడుతుందని తెలిపింది.

మంగళవారం (ఆగస్టు 26) స్వామివారిని 77,837 మంది భక్తులు దర్శించుకోగా.. 21,510 మంది తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు వచ్చినట్లు టీటీడీ పేర్కొంది.

Next Story