- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలానికి భక్తుల తాకిడి
by Muthe.Rajitha |
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. క్రిస్మస్ సెలవులు, వారాంతపు హాలిడేలు కలిసి రావడంతో వేకువజాము నుంచే భక్తులు క్యూ లైన్‌లలో బారులు తీరారు. క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోగా, శిలాతోరణం వరకు క్యూ లైన్ కొనసాగుతోంది. సాధారణ సర్వదర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు క్యూ లైన్‌లలో మంచినీరు, అల్పాహారం, మజ్జిగ, పాలు పంపిణీ చేయడంతో పాటు చిన్నారులు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే ఆన్‌లైన్‌లో శీఘ్ర దర్శనం, VIP బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు చాలా సమయం వేచి ఉండాల్సి వస్తోంది. రద్దీ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఆన్‌లైన్ బుకింగ్‌ను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story






