- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘మార్క్’.. జాతీయ స్థాయిలో తన శాఖలకు గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ తన శాఖల ద్వారా పరిపాలనలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన శాఖల ద్వారా పరిపాలనలో సరికొత్త రికార్డులు (New records) సృష్టిస్తున్నారు. ఆయన పర్యవేక్షణలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు (Panchayat Raj and Rural Development Departments) జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాయి. గతంలో ఉద్యోగుల శిక్షణ, సామర్థ్య పెంపులో దేశవ్యాప్తంగా 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం విశేషం. ఆయన తీసుకున్న ప్రత్యేక చొరవ, నిరంతర సమీక్షల ఫలితంగానే ఏపీ ఈ ఘనత సాధించిందని జాతీయ స్థాయి సంస్థలు సైతం ప్రశంసిస్తున్నాయి.
ముఖ్యంగా శాఖాపరమైన ఉద్యోగులకు వృత్తిపరమైన శిక్షణ (Professional training) ఇవ్వడంలోనూ, వారి పనితీరును మెరుగుపరచడానికి అత్యధిక సంఖ్యలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంలోనూ ఏపీ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో పాలనను ప్రజలకు చేరువ చేయడంలో పవన్ కల్యాణ్ సక్సెస్ అయ్యారు. ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపుతూ, వారి శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో పవన్ కల్యాణ్ చొరవ ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. జాతీయ స్థాయిలో ఈ స్థాయి గుర్తింపు రావడం పట్ల ప్రభుత్వ వర్గాలతో పాటు పార్టీ శ్రేణులు, కూటమి నేతలు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE ....
AP Deputy CM:పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన వాయిదా






