‘వాటి కదలికలను నిశితంగా గమనించండి’.. డిప్యూటీ CM పవన్ కల్యాణ్ ఆదేశం

by Gantepaka Srikanth |

ప్రజలను రక్షించే క్రమంలో ఏనుగు దాడి(Elephant Attack) చేయడంతో గాయపడిన అటవీశాఖ ఉద్యోగులకు తక్షణం తగు వైద్య సాయం అందించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అటవీశాఖ ఉన్నతాధికారులను అదేశించారు.

‘వాటి కదలికలను నిశితంగా గమనించండి’.. డిప్యూటీ CM పవన్ కల్యాణ్ ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలను రక్షించే క్రమంలో ఏనుగు దాడి(Elephant Attack) చేయడంతో గాయపడిన అటవీశాఖ ఉద్యోగులకు తక్షణం తగు వైద్య సాయం అందించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అటవీశాఖ ఉన్నతాధికారులను అదేశించారు. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన ఎఫ్ఎస్ఓ సుకుమార్, ఏనుగుల ట్రాకర్ హరిబాబులకు మెరుగైన చికిత్స అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం చిరుతపల్లి అటవీ ప్రాంతం నుంచి ఒక ఏనుగు చిత్తూరు జిల్లా, పలమనేరు పట్టణ పరిసరాల్లోకి చొరబడింది. ఏనుగు సంచారంతో ప్రజలు భయబ్రాంతులకు గురి కావడంతో అటవీ సిబ్బంది, రక్షణ వాచర్లు, పోలీసులతో కలసి ఆ ఏనుగును తిరిగి అడవి వైపు మళ్లించేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఏనుగు ఎదురు దాడి చేయడంతో సుకుమార్, హరిబాబులకు గాయాలు అయ్యాయి. అయినప్పటికీ ఏనుగుని విజయవంతంగా తిరిగి అడవిలోకి మళ్లించారు. అటవీశాఖ అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఏనుగుల సంచారంపై సమీక్షించారు. గాయపడిన సిబ్బందికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని పీసీసీఎఫ్ పీవీ చలపతిరావుని ఆదేశించారు. ఏనుగుల సంచారం పట్ల అప్రమంతంగా ఉండాలని, కదలికలను కొన్ని రోజుల పాటు నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. అవసరం అయితే కుంకీ ఏనుగులతో గస్తీ నిర్వహించాలని చెప్పారు.

Next Story