- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DCM:రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పిలుపు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల(జూన్) 4వ తేదీకి ఏడాది పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో, రాష్ట్రంలో కూటమి సారథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 4వ తేదీకి ఏడాది పూర్తి కానుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ఘనంగా వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు. జూన్ 4న రాష్ట్ర ప్రజలు సంక్రాంతి, దీపావళి పండుగలను చేసుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలకు కీలక సూచనలు ఇచ్చారు.
జూన్ 4వ తేదీన వాకిళ్లను రంగవల్లులతో అలంకరించండి. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించండి. గత ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వైసీపీ పీడ విరగడై ఆ రోజుకు ఏడాది పూరైన నేపథ్యంలో సాయంత్రం ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చండని పవన్ కళ్యాణ్ తెలిపారు. అంతేకాదు ఆ వేడుకల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విస్తృతంగా డిజిటల్ ప్రచారం చేపట్టాలని జనసేన నాయకులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు.






