- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారిన పోయే వాళ్లు రాళ్లు వేస్తామంటే ఊరుకోం: పవన్ కల్యాణ్ వార్నింగ్
ఇప్పటివరకూ అన్నీ భరించామని, ఇకపై భరించే ఓపిక లేదని జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: ఇప్పటివరకూ అన్నీ భరించామని, ఇకపై భరించే ఓపిక లేదని జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Janasena Chief and Deputy CM Pawan Kalyan) అన్నారు. జగన్‌ను అరెస్ట్ చేయాలంటూ హోంమంత్రి అమిత్ షాకు తాను చెప్పినట్లు కొందరు చేస్తు్న్న ప్రచారంపై ఆయన స్పందించారు. వైసీపీ నాయకుడు జైలుకెళ్లాలని తామెందుకు కోరుకుంటామని, ఆ నేత జైలుకెళ్తే జనసేన పార్టీ ఎదుగుతుందా అని ప్రశ్నించారు. కేంద్రహోంమంత్రి అమిత్ షాతో ఇలాంటి విషయాలు మాట్లాడతామా అని మండిపడ్డారు. ఇది వ్యవస్థను అవమానించడమేనని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసమే తాము అమిత్ షాను కలిశామని స్పష్టత ఇచ్చారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తమ ఎదుగుదల కోసం ఇతరులను వాడుకోవద్దని పవన్ కల్యాణ్ సూచించారు.
మాపై రాళ్లు వేస్తామంటే ఊరుకోం
దారిన పోయే వాళ్లు జనసేన పార్టీపై రాళ్లు వేస్తామంటే ఊరుకోనని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. దేనికైనా హద్దు ఉంటుందని రెచ్చగొట్టొద్దన్నారు. శత్రువులు ఎక్కడో లేరని, జనసేన పార్టీలోనే ఉన్నారని మండిపడ్డారు. అమిత్ షాతో మాట్లాడినవి బయటి వాళ్లకు ఎలా తెలుస్తాయన్నారు. ఈ విషయంపై ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదన్నారు. జనసేన నాయకులు బలపడాలని, కానీ చప్పబడిపోయారని అసహనం వ్యక్తం చేశారు. పదవులు ఇవ్వగానే చాలా మంది మెత్తబడిపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి నాయకులు జనసేనకు అవసరం లేదన్నారు. తాను టీడీపీ కోసం కాదని, రాష్ట్రంకోసం సర్దుకుపోతున్నానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. చిన్న సమస్యలున్నాయని, అవి తారాస్థాయికి చేరుకోలేదని పవన్ కల్యాణ్ చెప్పారు.






