- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం (Shankara Guptam) మేజర్ డ్రెయిన్ (Major Drain) ఆధునీకరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా పనులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వర్చువల్ గా పాల్గొనగా.. శంకరగుప్తంలో నిర్వహించిన ప్రత్యక్ష కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, జిల్లా కలెక్టరుతో పాటు జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.
అయితే మొంథా తుఫాను కారణంగా కోనసీమ ప్రాంతంలోని డ్రెయిన్ సరిగ్గా పని చేయలేదు. దీంతో కొబ్బరి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శంకరగుప్తంలోని కొబ్బరి రైతులు ఎంతగానో నష్టపోయారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం స్వయంగా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కొబ్బరి రైతులను పరామర్శించారు. వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీనిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులను నేడు వర్చువల్ గా ప్రారంభించారు.
రూ.20.77 కోట్ల అంచనా వ్యయంతో కూటమి ప్రభుత్వం శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులను చేపడుతోంది. ఈ ఆధునీకరణ పూర్తైతే వర్షకాలంలో నీరు నిల్వదు. తద్వారా వేల ఎకరాల్లో సాగవుతున్న కొబ్బరి, ఇతర పంటలకు కూడా రక్షణ లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. రైతు కష్టాలను అర్థం చేసుకొని కేవలం 35 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకున్న డిప్యూటీ సీఎంకు, ఆయనకు సహకరిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు స్థానిక నాయకులు, కొబ్బరి రైతులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.






