- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధ్యప్రదేశ్ వాళ్లను అడ్డుకోవద్దు.. చర్యలు తప్పవ్: పవన్ కల్యాణ్ హెచ్చరిక
అనుమతులు ఉన్న స్థానికేతరులను అడ్డుకోవద్దని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులమని, ఎవరు ఎక్కడైనా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. సచివాలయం(Secratariat)లో మధ్యప్రదేశ్ మాండ్లా పార్లమెంటు సభ్యుడు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే కలిసిన సందర్భంగా నాన్ లోకల్ అంశంపై ఆయన మాట్లాడారు. ఏ ప్రాంతం వారైనా సరే ఏ రాష్ట్రంలోనైనా పనులు చేసుకోవచ్చని పవన్ స్పష్టం చేశారు. స్థానికేతరుల పేరిట అనుమతులు ఉన్నా పనులు చేయకుండా అడ్డు తగిలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే అన్నమయ్య జిల్లా(Annamiah District) పుంగనూరు(Punganuru) నియోజకవర్గం సదుంలో గ్రానైట్ మైనింగ్(Granite mining)కి మధ్యప్రదేశ్ వాసులు అనుమతులు పొందారని, స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారని పవన్ కల్యాణ్ దృష్టికి డాక్టర్ కులస్తే తీసుకెళ్లారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మైనింగ్ ఎలా చేస్తారని బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు.
ఈ అంశంపై స్పందించిన పవన్ కల్యాణ్ అలాంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. అనుమతులు ఉన్న వారు నిబంధనలు ప్రకారం మైనింగ్ చేసుకునే ప్రక్రియను అధికార యంత్రాంగం చూస్తుందని భరోసా ఇచ్చారు.






