ఏనుగుల సంచారంపై అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

by Muthe.Rajitha |

ఏనుగుల(Elephants) సంచారంపై అధికారులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కీలక ఆదేశాలు జారీ చేసారు.

ఏనుగుల సంచారంపై అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏనుగుల(Elephants) సంచారంపై అధికారులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కీలక ఆదేశాలు జారీ చేసారు. తిరుపతి, చిత్తూరులో ఏనుగుల సంచారంపై పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం రాత్రి శ్రీవారి మెట్టు మార్గంలో 11 ఏనుగుల గుంపు సంచరించింది. పంప్ హౌస్ వద్ద గల పంటపొలాలలో పడి, పంటలను నాశనం చేసాయి. ఈ ఘటనపై అధికారులకు పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేసారు. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. గ్రామాల్లో వాట్సప్ గ్రూప్స్ క్రియేట్ చేసి, అందులో సమాచారం అందించాలని అధికారులకు తెలియజేశారు. ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా, అటవీ ప్రాంతాల్లోకి వెళ్లేట్టు చర్యలు తీసుకోవాలని, అటవీ సమీప ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అటవీశాఖ అధికారులు పెట్రోలింగ్ నిర్వహించాలని తెలియ జేశారు.

Next Story