- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Nadendla: దీపం-2 పథకంపై దుష్ప్రచారం.. మంత్రి నాదెండ్ల ఆగ్రహం
by Naga Rani Yarlagadda |
దీపం -2 పథకం ద్వారా ఇప్పటి వరకూ 50 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. శుక్రవారం విజయవాడ, కృష్ణలంకలోని కోత మిషన్ రోడ్డు ప్రాంతంలో జరిగిన దీపం-2 ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: దీపం -2 పథకం ద్వారా ఇప్పటి వరకూ 50 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. శుక్రవారం విజయవాడ, కృష్ణలంకలోని కోత మిషన్ రోడ్డు ప్రాంతంలో జరిగిన దీపం-2 ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. మూడు వారాల్లోనే దీపం-2 పథకం 50 లక్షల మైలురాయిని చేరుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. అత్యంత పారదర్శకత్వం అమలవుతున్న ఈ పథకంపై కొందరు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకం విజయవంతంగా అమలవుతోందని తెలిపారు. అనంతరం దీపం పథకం లబ్ధిదారులతో ముచ్చటించి.. పథకం అమలు తీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.
Next Story






