ఏపీలో ఆ ప్రాంతం పేరు మార్పు..జీవో జారీ

by velandi.Saikiran |

పెనుగొండ గ్రామం పేరు మార్చేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది కూట‌మి స‌ర్కార్‌. పెనుగొండను వాసవీ పెనుగొండగా పేరు మార్చుతూ

ఏపీలో ఆ ప్రాంతం పేరు మార్పు..జీవో జారీ
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరు మార్చేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది కూట‌మి స‌ర్కార్‌. పెనుగొండను ( Penugonda) వాసవీ పెనుగొండగా పేరు మార్చుతూ అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే జీవో కూడా విడుదల కానుంది. తాజాగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ మంత్రి సవితను ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ రాకేష్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘాల నేతలు కలిశారు.

ఈ సందర్భంగా పెనుగొండ విషయాన్ని ఏపీ మంత్రి సవితకు వివరించారు. దీంతో పెనుగొండ గ్రామాన్ని వాసవీ పెనుగొండగా పేరు మార్చనున్నట్లు ప్రకటన చేశారు మంత్రి సవిత. ఈ పేరు మార్పున‌కు సంబంధించిన జీవో త్వరలో విడుదల కానున్న‌ట్లు తెలిపారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారు జన్మించిన పెనుగొండ గ్రామానికి పురాతన చరిత్ర ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

Next Story