- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దశాబ్దాల నిరీక్షణ.. పూర్తయిన వంతెన
సుద్దగెడ్డ వాగుపై వంతెపూ పూర్తయ్యింది. కొత్త కాలనీవాసుల్లో ఆనందం వెల్లివిరిసింది.

దిశ, వెబ్ డెస్క్ : పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలోని గొల్లప్రోలువాసులు (Gollaprolu) వర్షాకాలం వచ్చిందంటే బెంబేలెత్తిపోతుంటారు. వరద కారణంగా ప్రతి ఏడాది ఇక్కడి కొత్త కాలనీవాసులు ఇబ్బందులు పడుతుంటారు. సుద్దగెడ్డ వాగులో ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వారి సమస్యను తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పరిష్కారానికి హామీనిచ్చారు. చెప్పినట్లుగానే గతేడాది సెప్టెంబరులో పనులను ప్రారంభించారు. గొల్లప్రోలు నుంచి కొత్త కాలనీకి సుద్దగెడ్డ వంతెన అప్రోచ్ రోడ్డు పనులను వేగవంతం చేసి ఎట్టకేలకు పూర్తి చేశారు. రక్షణ గోడలతో సహా వంతెన నిర్మాణానికి రూ.2 కోట్లు వెచ్చించగా.. రూ.1.10 కోట్ల వ్యయంతో రెండు వైపులా గ్రావెల్, సిమెంట్ రోడ్డును నిర్మించారు. జనవరి 5 నాటికి పనులు పూర్తికాగా.. నేడు గొల్లప్రోలు పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం వంతెనను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు వంతెన వద్ద అందమైన ముగ్గులు వేయడమే కాకుండా ప్లకార్టులతో సిద్ధంగా ఉన్నారు.
తొలగనున్న ఇబ్బందులు..
సుద్దగెడ్డ వంతెన అందుబాటులోకి రావడం ద్వారా స్థానికుల ఇబ్బందులు తొలగనున్నాయి. గొల్లప్రోలులోని సూరంపేట ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రమాదకరమైన కాలువ పక్కన వెళ్లాల్సిన అవసరం లేకుండా పోతోంది. తద్వారా విద్యార్థులు సురక్షితంగా బడికి వెళ్లే ఆస్కారం ఏర్పడుతోంది. అంతేకాకుండా రైతులు, ప్రజలు సుద్దగెడ్డ వాగు మీదుగా సురక్షితంగా రాకపోకలను సాగించనున్నారు. దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించడంతో గొల్లప్రోలువాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






