Anakapally Incident : అనకాపల్లి ప్రమాదంలో 8కి చేరిన మృతులు... విచారణకు ఆదేశించిన కలెక్టర్

by Muthe.Rajitha |   (  Updated:2025-04-13 12:50:32  IST  )

ఏపీ(AP)లోని అనకాపల్లి బాణాసంచా పేలుడు(Anakapally Incident) ఘటనలో మృతుల సంఖ్య 8 కి చేరింది.

Anakapally Incident : అనకాపల్లి ప్రమాదంలో 8కి చేరిన మృతులు... విచారణకు ఆదేశించిన కలెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లోని అనకాపల్లి బాణాసంచా పేలుడు(Anakapally Incident) ఘటనలో మృతుల సంఖ్య 8 కి చేరింది. అనకాపల్లి జిల్లా(Anakapally) కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రం(Fireworks manufacturing Unit)లో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్పాట్ లోనే ఐదుగురు చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. కాగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు విశాఖ కేజీహెచ్‌ వైద్యులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంపై కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 15 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు, వీరంతా సామర్లకోటకు చెందిన వారుగా అధికారులు తెలిపారు. కాగా ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనితకు ఫోన్ చేసి, ప్రమాద వివరాలు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Next Story