- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు రోడ్డు ప్రమాదంలో విజయనగరంవాసుల మృతి : హోం మంత్రి దిగ్భ్రాంతి
తమిళనాడులోని రామనాథపురం (Ramanathapuram) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) విజయనగరం జిల్లాకు చెందిన వారు మృతి చెందారు.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులోని రామనాథపురం (Ramanathapuram) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) విజయనగరం జిల్లాకు చెందిన వారు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anita) స్పందించారు. రాష్ట్రానికి చెందిన విజయనగరంవాసులు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. అధికారులను అడిగి ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను హోం మంత్రి తెలుసుకున్నారు. మృతదేహాలను త్వరితగతిన కుటుంబ సభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను తన ప్రగాఢ సానుభూతిని హోంమంత్రి ప్రకటించారు.
అయితే తమిళనాడులోని రామనాథపురం వద్దఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శబరిమల నుంచి రామేశ్వరం ప్రయాణమైన భక్తుల కారును మరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని విజయనగరంవాసులుగా పోలీసులు గుర్తించారు. కొరప కొత్తవలస, మరుపల్లికి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో కారును రోడ్డు పక్కన ఆపి నిద్రిస్తుండగా మరో వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. కొరప కొత్తవలస వాసులైన వంగర రామకృష్ణ (51), మార్పిన అప్పల నాయుడు (33), కొత్తవలసవాసి మరాడ రాము (50), గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన బండారు చంద్రారావు ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందినవారిలో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.






