- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డేటా.. నేటి సంపద
మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని ముఖ్యం కాదు.. నా దగ్గర ఎంత డేటా ఉందన్నదే ముఖ్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

దిశ, డైనమిక్బ్యూరో : మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని ముఖ్యం కాదు.. నా దగ్గర ఎంత డేటా ఉందన్నదే ముఖ్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు మంగళదాస్నగర్లోని ఓ ప్రైవేటు వైద్యశాలను ఈ రోజు ఆయన ప్రారంభించారు. టీడీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కుటుంబంలో ఒక ఐటీ చదువుకున్న వ్యక్తి ఉండాలని 1995లో చెప్పానని గుర్తు చేశారు. దాని ఫలితాలు ఇవాళ మన కళ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు.1995లో ఐటీ గురించి మాట్లాడా.. ఇవాళ ఏఐ గురించి మాట్లాడుతున్నా అన్నారు. భవిష్యత్‍లో ప్రపంచాన్ని ఏఐ శాసించబోతుందని ఆయన పునరుద్ఘాటించారు. ఏపీలో ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. భవిష్యత్తులో ప్రైవేటు సేవలు అనుసంధానంపై కూడా దృష్టి పెడతాం అని సీఎం తెలిపారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అప్పట్లో గుండె ఆపరేషన్ చికిత్సకు ఎన్టీఆర్ అమెరికా వెళ్లారని గెలిపారు. మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోయారని అన్నారు. క్యాన్సర్ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఎన్టీఆర్ బసవతారకం ఆసుపత్రిని ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. కిమ్స్ శిఖర ఆసుపత్రి నిర్వాహకులను అభినందించారు.






