తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాను.. 3-4 గంటలు అత్యంత కీలకం

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-28 14:47:07  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను(Montha Cyclone) తీరాన్ని తాకింది.

తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాను.. 3-4 గంటలు అత్యంత కీలకం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను(Montha Cyclone) తీరాన్ని తాకింది. కాకినాడ-మచిలీపట్నం(Kakinada-Machilipatnam) మధ్య తీరాన్ని తాకిందని APSDMA అధికారికంగా ప్రకటించింది. కాకినాడ సమీపంలో తీవ్రమైన తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. తుపాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటలు పడుతుందని వెల్లడించింది. తీరప్రాంత జిల్లాల్లో గంటకు 90-100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు.. తుపాన్‌ ప్రభావంతో పలుచోట్ల ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూలాయి. దీంతో అనేకచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుఫాన్ ప్రభావిత ఏడు జిల్లాల్లో ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు సహా అధికారులుంతా అప్రమత్తంగా ఉన్నారు.

Next Story