Montha Cyclone: చెట్ల కొమ్మలు, విద్యుత్ స్తంభాలు విరిగితే ఈ నంబర్లను సంప్రదించండి

by Naga Rani Yarlagadda |

శనివారం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారగా.. ప్రస్తుతం అతి వాయుగుండంగానే కొనసాగుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Montha Cyclone: చెట్ల కొమ్మలు, విద్యుత్ స్తంభాలు విరిగితే ఈ నంబర్లను సంప్రదించండి
X

దిశ, వెబ్‌డెస్క్: శనివారం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారగా.. ప్రస్తుతం అతి వాయుగుండంగానే కొనసాగుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ వాయుగుండం.. పోర్ట్ బ్లెయిర్ కి 550 కిలోమీటర్లు, చెన్నైకి 850 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 880 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కి 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో ఏపీ తీరం వైపుగా కదిలిన వాయుగుండం మరికాసేపటిలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదివారం సాయంత్రానికి తుపానుగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.

ఈ తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రికి తీరందాటే అవకాశం ఉందని, మచిలీపట్నం - కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరందాటవచ్చని అంచనా వేసింది. తీరందాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో పాటు.. కోస్తాంధ్ర జిల్లాల వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్హణ సంస్థ సూచించింది.

మొంథా తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీ పీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. తుపాను ప్రభావిత జిల్లాలైన కాకినాడ, కోనసమ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విద్యుత్ శాఖ అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈదురుగాలులు, భారీ వర్షాలకు తెగిపడిన విద్యుత్ వైర్లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లపై పడిన చెట్లకొమ్మల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే తాము ఇచ్చిన నంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు.

విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయం - 8331018762,

శ్రీకాకుళం - 9440635529

టెక్కలి - 9490610050

పలాస - 7396615568, 6281655632, 9550568756, 7981310114

పాలకొండ - 8332843546

పార్వతీపురం - 9492016109

విజయనగరం టౌన్ - 8465090654

విజయనగరం రూరల్ - 8332826430

బొబ్బిలి - 9492666989

విశాఖపట్నం జోన్–I - 9490610018

జోన్–II - 9490610020

జోన్–III - 9491030721

అనకాపల్లి - 9490610023

కశింకోట - 8333811271, 8333811272

నర్సీపట్నం - 9491030723

పాడేరు - 9440812511

రంపచోడవరం - 9059194449

అమలాపురం - 9490610101

రామచంద్రాపురం - 9493178821

జగ్గంపేట - 9490610096

కాకినాడ - 9493178718

పెద్దాపురం - 9059034479

రాజమండ్రి రూరల్ - 9490610003

రాజమండ్రి టౌన్ - 9490610855

నరసాపురం - 9490610151

భీమవరం - 9490610143

ఏలూరు - 9440904037

జంగారెడ్డిగూడెం - 9491030712

Next Story