- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడేళ్లకొకసారి పెళ్లి చేసుకుంటున్న దంపతులు.. ఆ ఊరిలో వింత ఆచారం
ఒక్కసారి దాంపత్య బంధం ఏర్పడ్డాక మరణించేంతవరకూ ఆ బంధమే శాశ్వతంగా ఉంటుందంటారు పెద్దలు.

దిశ, వెబ్‌డెస్క్: ఒక్కసారి దాంపత్య బంధం ఏర్పడ్డాక మరణించేంతవరకూ ఆ బంధమే శాశ్వతంగా ఉంటుందంటారు పెద్దలు. కష్టసుఖాల్లో ఆలుమగలు పాలు పంచుకుంటూ.. ఒకరికొకరు తోడుగా నిలుస్తారని చెప్తారు. కానీ ఈ రోజుల్లో పెళ్లిళ్లు.. మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ ఊరిలో కొనసాగుతున్న ఆచారం అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రతీ మూడేళ్లకు ఒకసారి ఆ ఊరిలో దంపతులు మళ్లీ పెళ్లి చేసుకుంటుంటారు. ఇదేదో తూతూ మంత్రంగా, మొక్కుబడిగా కాకుండా.. వివాహ తంతు ఎలా జరుగుతుందో అలాగే వేడుకగా చేసుకుంటున్నారు.
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కొత్తపాలెం గ్రామస్తులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. అక్కడున్న నాగార్పమ్మ అమ్మవారి ఆలయంలో దామిరెడ్డి వంశానికి చెందినవారు కొలుపులు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రెండో రోజు పట్నం కొలుపులు నిర్వహిస్తారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం.. భార్యభర్తలు ప్రతి మూడేళ్లకు ఒకసారి మళ్లీ పెళ్లిచేసుకోవడం విశేషం. ఈ ఏడాది పట్నం కొలుపుల్లో 40 మంది జంటలు వేద మంత్రోచ్ఛారణల మధ్య పెళ్లి చేసుకున్నారు.






