- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతను మోసం చేసిన లవర్స్.. వెలుగులోకి సంచలన విషయాలు
అడవివరం గ్రామానికి చెందని హనుమంతు సురేష్, తన ప్రియురాలితో కలిసి నిరుద్యోగ యువతను మోసం చేశారు

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖలో నఖీలీ పోలీసుల వేషంలో ఘరానా మోసం వెలుగుచూసింది. అడవివరం గ్రామానికి చెందని హనుమంతు సురేష్, తన ప్రియురాలితో కలిసి నిరుద్యోగ యువతను మోసం చేశారు. తాము పోలీసులమని నమ్మించి, పోలీసు ఉద్యోగాలు ఇప్పస్తామని చెప్పి నిరుద్యోగులకు గాలం వేశారు. ఎస్సై యూనిఫాంలో రావడంతో.. నిజంగానే పోలీసులని నమ్మి మోసపోయారు. పెద్దవాళ్లతో పరిచయాలు ఉన్నాయని, పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మధ్యవర్తుల ద్వారా.. 30 మంది వద్ద దాదాపు 3 కోట్లు వసూలు చేసి పరారయ్యారు. మోసపోయామని గుర్తించిన యువత పోలీసులకు సమాచారం అందించడంతో.. విచారణ జరిపి ఆ లవర్స్ జంట హైదరాబాద్ లో ఉన్నారని గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ బృందం విచారణలో సంచలన విషయాలు బయటపెట్టారు. నిందితుడికి ఇదివరకే ఇద్దరు భార్యలు ఉన్నారని, కొంతకాలంగా ప్రియురాలితో ఉంటూ.. మోసాలకు పాల్పడుతున్నాడని తెలిసింది.
Read More..






