Tirumala News : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

by Muthe.Rajitha |

తిరుమల(Tirumala) తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Tirumala News : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala) తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. విద్యార్థులకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తులు భారీగా శ్రీవారి దర్శనానికి తిరుమల చేరుకుంటున్నారు. దీంతో గత వారం రోజుల నుంచి సాధారణం కంటే ఎక్కువ రద్దీ చోటు చేసుకుంటోంది. నేడు 29 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న శ్రీవారిని 84,418 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక సోమవారం హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చినట్టు టీటీడీ(TTD) పేర్కొంది.

Next Story