కోర్టు ధిక్కరణ: ఏపీలో మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష

by Disha Web Desk 21 |
కోర్టు ధిక్కరణ: ఏపీలో మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారుల తీరుపై న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేయడం పరిపాటిగా జరుగుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల దగ్గర నుంచి ఇతర అధికారులు సైతం న్యాయస్థానాల్లో మెుట్టికాయలు వేయించుకుంటున్నారు. తాజాగా వీరిజాబితాలోకి గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌ కీర్తి చేరారు. మున్సిపల్ కమిషనర్ కీర్తికి నెల రోజుల జైలు శిక్షతో పాటుగా రూ.2 వేలు జరిమానా విధిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. వచ్చే నెల జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రారు కార్యాలయంలో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ మున్సిపల్ కమిషనర్ కీర్తికి శిక్ష ఎందుకు పడిందో ఓ సారి తెలుసుకుందాం. గుంటూరు కొత్తపేటలో యడవల్లివారి సత్రంలో ఎలాంటి లీజ్ చెల్లించకుండా పాఠశాలను నడుపుతున్నారంటూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్‌కు రూ.25 లక్షలు చెల్లించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలు అమలు చేయడంలో మన్సిపల్ కమిషనర్ కీర్తి నిర్లక్ష్యం వహించారు. దీంతో పిటిషనర్ మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరికి నెలరోజులు జైలు శిక్ష రూ.2వేలు జరిమానా విధించింది. జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.



Next Story

Most Viewed