- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం కాకముందు ఒకటి.. అయ్యాక ఇంకోటి చేశాడు జగన్: వైఎస్ షర్మిల విమర్శలు
సీఎం కాకముందు ఒకటి.. అయ్యాక ఇంకోటి చేశాడు జగన్ అని వైఎస్ షర్మిల విమర్శించారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి ఏమీ ఇవ్వని బీజేపీని జగన్ అసలు ప్రశ్నించారని ఆమె వ్యాఖ్యానించారు...

దిశ, వెబ్ డెస్క్: సీఎం కాకముందు ఒకటి.. అయ్యాక ఇంకోటి చేశాడు జగన్(Jagan) అని వైఎస్ షర్మిల విమర్శించారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి ఏమీ ఇవ్వని బీజేపీ(Bjp)ని జగన్ అసలు ప్రశ్నించారని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా జగన్ మాట్లాడటం ఎప్పుడో మానేశారని తెలిపారు. ప్రత్యేక హోదా(Special Status)పై కాలర్ పట్టుకుని తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మర్చిపోయారని గుర్తు చేశారు. స్వార్థ రాజకీయాల కోసం మోడీని ప్రశ్నించడంలేదని మండిపడ్డారు. బీజేపీకి ఏపీ నేతలు సాగిలపడ్డారని విమర్శించారు. రాష్ట్రానికి బీజేపీ ఒక్క మేలు కూడా చేయలేదన్నారు. ‘‘ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అమరావతిని, పోలవరాన్ని కట్టలేదు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది. కానీ ఏ ఒక్కరూ కూడా కనీసం ఒక్క మాట కూడా అనడంలేదు. బీజేపీని వ్యతిరేకించి మాట్లాడిన ఒకే పార్టీ కాంగ్రెస్ మాత్రమే. పక్క రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి. కానీ ఏపీకి మాత్రం ఏమీ లేదు. మన బిడ్డలు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలి. నిరుద్యోగులకు భరోసా లేదు. ఇద్దరు సరిపోరట.. ముగ్గురు, నలుగురిని కనాలని చంద్రబాబు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే బోడి రూ. 25 వేల కోసం బిడ్డల్ని కనాలా.’’ అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.






