- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
డ్రైవర్‌పై దాడికి నిరసనగా కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

దిశ, కడప: కడప జిల్లా దవ్వూరులో ఆళ్లగడ్డ డిపో డ్రైవర్‌పై ప్రయాణికుడి దాడికి నిరసనగా కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోని ఆర్టీసీ డిపోలలో విధులు నిర్వహించే ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు సమ్మె నిర్వహించారు. దీంతో ప్రయాణీకులు బస్సు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్బంగా పలువురు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు మాట్లాడుతూ ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోకు చెందిన అద్దె బస్సు ఆళ్లగడ్డ నుంచి మైదుకూరుకు బయలు దేరిందన్నారు. మార్గమధ్యలో 120 మంది ప్యాసింజర్లు ఉండటంతో బస్సు ఆపలేదన్నారు. దీంతో దువ్వూరు వద్ద కడపకు చెందిన హేమవర్థన్ తన కుటుంబ సభ్యులతో కలసి బస్సులో ఉన్న డ్రైవర్ పై దాడికి పాల్పడడంతో తల పగిలిందన్నారు. బస్సులో పరిమితికి మంచి ప్రయాణీకులను ఎక్కించుకున్నా కూడ బస్సు ఆపలేదని డ్రైవర్ ను క్రిందకు లాగి కొట్టారన్నారు. ఈ విధంగాఇష్టాను సారంగా ప్రయత్నిస్తున్నారన్నారు. డ్యూటీ చేయాలంటే కష్టతరంగా ఉందన్నారు. అదే విధంగా ప్రయాణికులు ఎక్కపడితే అక్కడ ఆపటం చేస్తున్నారన్నారు.
ఒక ఊరికి ఒక స్టేజ్ కాకుండా ఇంటి దగ్గర ఆపుకుంటున్నారన్నారు. ప్యాసింజర్స్ కు కండక్టర్ సపోర్టు చేసి డ్రైవర్ పై రెచ్చగొట్టిస్తున్నారన్నారు. తమ పై జరుగుతున్న దాడులను అరికట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేక పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిమితి మంచి ప్యాసింజర్లను ఎక్కించటం ఆపాలని, ఇష్టాను సారంగా ఎక్కడ పడితే అక్కడ ఆపటం సరికాదన్నారు. అద్దె బస్సు డ్రైవర్స్ అంటే అధికారులకు చులకనగా ఉంటోందన్నారు. తమపై ప్యాసింజర్స్ వల్ల ఎటువంటి సమస్య జరిగినా అధికారులు పరిష్కరించాలని వారు ఆర్టీసీ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై స్పందించిన రాష్ర్ట రవాణశాఖ మంత్రి మండిపల్లి రాంప్రాసద్ రెడ్డి ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సమస్యలను పరిష్కరించి ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.






