కామంతో రగిలిపోతున్న కామర్స్ లెక్చరర్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని బుద్ధి చెప్పిన భార్య

by Ajay Maddhiboyina |

కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలో కామ‌ర్స్ లెక్చ‌ర‌ర్ కామ‌లీల‌లు వెలుగులోకి రావ‌డం క‌ల‌కలం రేపుతోంది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువ‌తుల‌ను లోబ‌రుచుకుంటున్న లెక్చ‌ర‌ర్ జాషువా బాగోతాన్ని అత‌డి భార్యే బ‌య‌ట‌పెట్టింది.

కామంతో రగిలిపోతున్న కామర్స్ లెక్చరర్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని బుద్ధి చెప్పిన భార్య
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలో కామ‌ర్స్ లెక్చ‌ర‌ర్ కామ‌లీల‌లు వెలుగులోకి రావ‌డం క‌ల‌కలం రేపుతోంది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువ‌తుల‌ను లోబ‌రుచుకుంటున్న లెక్చ‌ర‌ర్ జాషువా బాగోతాన్ని అత‌డి భార్యే బ‌య‌ట‌పెట్టింది. రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకుని అత‌డిని చిత‌క‌బాది పోలీసుల‌కు అప్ప‌గించింది. భార్య తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... ఉద్యోగాల పేరుతో త‌న భ‌ర్త జాషువా ఎంతో మంది యువ‌తుల‌ను మోసం చేశాడ‌ని చెప్పింది. అవ‌నిగ‌డ్డలోని ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో జాషువా లెక్చ‌ర‌ర్ గా ప‌నిచేస్తున్నాడ‌ని తెలిపింది.

ఉద్యోగం ఇప్పిస్తాన‌ని న‌మ్మించి ఓ యువ‌తిని మ‌చిలీపట్నంలోని గొడుగుపేట సెంట‌ర్ లోని త‌మ ఇంటికి తీసుకువెళ్ల‌గా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్న‌ట్టు చెప్పింది. యువ‌తిని అతడు లోబ‌రుచుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా హ్యూమ‌న్ రైట్స్ ఆర్గ‌నైజేష‌న్ స‌హ‌కారంతో ప‌ట్టుకున్న‌ట్టు తెలిపింది. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు కేసుపై విచార‌ణ జ‌రుపుతున్నారు. కేసుపై మ‌రింత స‌మాచారం కోసం ఆరా తీస్తున్నారు. మ‌రోవైపు కాలేజీ లెక్చ‌రర్ ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు ఆందోళ‌న‌క‌రంగా మారింది. త‌మ బిడ్డ‌ల‌ను కాలేజీకి చ‌దువుకునేందుకు పంపిస్తే అస‌లు సేఫ్ గా ఉంటారా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Next Story