- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రండి.. వచ్చి ఏపీ పర్యాటకంలో పెట్టుబడులు పెట్టండి
సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu).. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నాయకత్వంలో ఏపీ పర్యాటకం అభివృద్ధి పథంలో నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu).. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నాయకత్వంలో ఏపీ పర్యాటకం అభివృద్ధి పథంలో నడుస్తోంది. అందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలను సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వాటిని ఆచరణలోకి తెస్తోంది. భవిష్యత్తులో రాష్ట్ర పర్యాటక రంగం (Tourism) మరింత అభివృద్ధి చెందేందుకు అపార అవకాశాలు ఉన్నాయి. పర్యాటక రంగంలో పెట్టబడులు పెట్టాలని ఏపీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులను కోరుతోంది. విశాఖపట్నం వేదికగా నవంబరు 14, 15 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరై పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని ఆహ్వానిస్తోంది.
మంత్రి కందుల దుర్గేష్ విదేశీ పర్యటన
ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ Kandula Durgesh) లండన్ లో పర్యటిస్తున్నారు. లండన్ లో ఏపీ పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా మూడో రోజు వరల్డ్ ట్రావెల్ మార్కెట్ -2025 ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఇతర రాష్ట్రాల,దేశాల స్టాల్స్ ను, టూరిజం బోర్డులను పరిశీలించారు. అదే విధంగా ఉమ్మడి మార్కెటింగ్ ప్రచారం కోసం వివిధ దేశాల, రాష్ట్రాల టూరిజం అధికారులతో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సౌదీ, రియాద్, మాల్దీవులు, కొలంబియా, శ్రీలంక, వియత్నాం, ఆస్ట్రియా, థాయిలాండ్, జర్మనీ, సింగపూర్, ఇటలీ, స్వీడన్, పోలాండ్, టర్కీ దేశాల టూరిజం రంగంలో అవలంబిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు.
వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో ఏపీ గళం
వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM) ప్రదర్శన వేదికగా అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలతో పరిచయాలు ఏర్పరుచుకోవడంతో పాటు రాష్ట్ర పర్యాటక వాణిని మంత్రి దుర్గేష్ వినిపించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక ప్రాంతాలపై పలు దేశాల టూర్ ఆపరేటర్లు, ట్రావెలర్లు ఆసక్తి కనబరిచారు. ఏపీ పర్యాటక ప్రాంతాల విశిష్టత, భౌగోళిక సమాచారాన్ని ఆయా సంస్థల ప్రతినిధులు తీసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి దుర్గేష్ ఏపీ పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించారు. అంతేగాక రాష్ట్రంలోని పర్యాటక, చారిత్రక, వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన ప్రదేశాల వైపు పర్యాటకులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని, డిజిటల్ మాధ్యమాల్లో పర్యాటక ప్రాంతాలకు ప్రచారం కల్పిస్తున్నామని తెలిపారు.
పెట్టుబడిదారులకు ఆహ్వానం
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రత్యేకతలపై వేర్వేరుగా రూపొందించిన వీడియోలను మంత్రి చూపించారు. అదే విధంగా టూరిజం ప్రాంతాలపై రూపొందించిన బుక్ లెట్ ను అందించారు. నూతన పర్యాటక పాలసీ (Tourism Policy) పత్రాలను అందజేశారు. రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను అక్కడికి వచ్చిన మైస్, కార్పొరేట్, ట్రావెల్, టెక్నాలజీ రంగాల జాతీయ, అంతర్జాతీయ ఆపరేటర్లకు వివరించారు.ఈ సందర్భంగా నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని ఇన్వెస్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.






