- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Colombo: కొలంబోకు.. ఎందుకబ్బా..?
చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నేడు కొడాలి నాని (Kodali Nani).. ఇద్దరూ వైసీపీ నేతలు. ఒకరు మాజీ మంత్రి కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్యే. వీరిద్దరినీ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్అధికారులు అడ్డుకున్నారు.

నిన్న చెవిరెడ్డి, నేడు కొడాలి నాని!
అక్కడికి వెళుతుండగా అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
కొలంబో ఎందుకెళుతున్నారంటూ సోషల్మీడియాలో చర్చ
దిశ, డైనమిక్ బ్యూరో : చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నేడు కొడాలి నాని (Kodali Nani).. ఇద్దరూ వైసీపీ నేతలు. ఒకరు మాజీ మంత్రి కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్యే. వీరిద్దరినీ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్అధికారులు అడ్డుకున్నారు. వారిపై లుక్అవుట్నోటీసులు ఉండడంతో విదేశాలకు వెళ్లకుండా ఆపారు. ఆ సమాచారాన్ని ఏపీ పోలీసులకు అందజేశారు. అయితే.. ఇద్దరూ ఇండియా నుంచి కొలంబోకి (Colombo) వెళుతుండడం చర్చకు దారితీసింది. బెంగళూరు నుంచి కొలంబోకి వెళ్లేం దుకు చెవిరెడ్డి (Chevireddy) ప్రయత్నించగా.. కలకత్తా నుంచి కొలంబోకి వెళ్లేందుకు కొడాలి నాని బయలుదేరినట్లు సమాచారం. కొద్ది రోజుల కిందట అరెస్టు అయిన మాజీ మత్రి కాకాణి గోవర్ధనరెడ్డి కూడా కొలంబోకి వెళ్లేందుకు ప్లాన్చేసుకు న్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. కొంపదీసి అక్కడేమైనా జగన్కొత్త పార్టీ పెడుతున్నారా.. అంటూ సోషల్మీడియాలో కొందరు సైటర్లు వేస్తున్నారు. అవినీతి సొమ్మంతా అక్కడ పెట్టారా..అంటూ టీడీపీ సోషల్మీడియా పోస్టులు పెడుతోంది.






