ఏపీ ప్రజలకు చల్లటి కబురు..రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

by Mamatha |
ఏపీ ప్రజలకు చల్లటి కబురు..రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఎన్నడూ లేని విధంగా నిండూ వేసవిలో వర్షాలు పడుతున్నాయి. ఈ సంవత్సరం ముందుగానే రుతుపవనాలు వస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రేపు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. గురువారం ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. ఎల్లుండి ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

Next Story