రాష్ట్రంలో రేపు కీలక కార్యక్రమం: వారందరికి సీఎం చంద్రబాబు పిలుపు

by Vemula.Srinu Prasad |

స్వర్ణాంధ్ర-2047 సంకల్పంలో భాగంగా కూటమి ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్నిఈ శనివారం సైతం నిర్వహిస్తోంది

రాష్ట్రంలో రేపు కీలక కార్యక్రమం: వారందరికి సీఎం చంద్రబాబు పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: స్వర్ణాంధ్ర-2047 సంకల్పం(Swarnandhra-2047 Vision)లో భాగంగా కూటమి ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని(Swacha Andhra program) ప్రతి నెలా 3వ శనివారం నిర్వహిస్తోంది. అయితే నెల నెలా ఒక్కో థీమ్‌ను ఎంచుకుంటోంది. ఈ సారి 'e-వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడం' థీమ్‌ను ఎంచుకుంది. ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ట్వీట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఇ-వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కేంద్రాల నిర్వహణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎస్‌హెచ్‌జి సభ్యులను గుర్తించాలని, వారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. 'రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్" అనేది e - వేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా స్వర్ణాంధ్ర సంకల్పాన్ని మరింత ముందుకు వెళ్లే కార్యక్రమంలో భాగస్వాములు స్వాములు కావాలని ప్రతి ఒక్కరికి సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

Next Story