- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనవరి నుంచి సీఎం జిల్లాల పర్యటన
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన చేయనున్నట్టు ప్రకటించారు. నేడు అమరావతి సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల్లో ఆకస్మిక పర్యటనలు చేసి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యల పరిష్కారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం సహించబోమని స్పష్టం చేసిన చంద్రబాబు.. జీరో టాలరెన్స్ విధానంతో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ సేవల డెలివరీలో “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” తరహాలో వేగం ఉండాలన్నారు. డేటా ఆధారిత పరిపాలన, ఆన్‌లైన్ సేవలు, ప్రజల సంతృప్తి స్థాయి పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పనితీరును కూడా ఆయన ప్రశంసించారు. కాగా సీఎం ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా పరిపాలనా యంత్రాంగం అప్రమత్తమయినట్టు సమాచారం.






