- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్: ముందస్తు ఎన్నికలపై CM జగన్ క్లారిటీ
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో ముందస్తు ఎన్నిలకపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఇవాళ్టి కేబినెట్ భేటీలో ముందస్తు ఎన్నిలకపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని.. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలకు మరో తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉందని.. ఈ తొమ్మిది నెలలు కష్టపడితే ఏపీలో అధికారం మళ్లీ మనదేనని మంత్రులకు సూచించారు. దీంతో జగన్ సర్కార్ ముందస్తు ఎన్నిలకు వెళ్తుందని గత కొన్ని రోజులుగా జరుగుతోన్న ప్రచారానికి తెరపడింది.
Next Story






