- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమ్మ వాళ్ళు మా పార్టీలో ఉంటే నీకేమైనా అభ్యంతరమా.. జగన్ ఫైర్
రెంటపాళ్ల పర్యటనలో మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం పాపం చేశారని నాగమల్లేశ్వరరావును చంపారని మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: రెంటపాళ్ల పర్యటనలో మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం పాపం చేశారని నాగమల్లేశ్వరరావును చంపారని మండిపడ్డారు. కమ్మవాళ్లు వైసీపీలో ఉంటే మీకేమైనా అభ్యంతరమా? అని ప్రశ్నించారు. నీకు ఊడిగం చేయడానికి కమ్మవాళ్లు పుట్టారు అనుకుంటున్నావా అని ప్రశ్నించారు. కమ్మవాళ్లు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే వెంటాడి, హింసించి జైల్లో పెడుతున్నాడని మండిపడ్డారు. తప్పుడు కేసులు సృష్టించి వాళ్లను ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేత కమ్మసామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశీని అక్రమ కేసులతో వేధిస్తున్నారని అన్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చేసరికి మరో కేసు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆయనను జైలులో పెట్టి రెండు నెలలు దాటిపోయిందని అన్నారు. ఏం పాపం చేశారని వంశీ, కొడాలి నానిపై కేసులు పెట్టారని ప్రశ్నించారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలిని కూడా వేధిస్తున్నారని అన్నారు. మీరు మీతో పాటు కొన్ని ఛానళ్లు రాష్ట్రాన్ని దోచుకోవడం.. దోచుకున్న దాన్ని పంచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులను ఎత్తి చూపితే వెంటాడి చంపుతావా అంటూ మండిపడ్డారు.






