విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-31 10:43:59  IST  )

విచ్చలవిడి డ్రగ్స్ వినియోగంపై సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు...

విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో డగ్స్(Drugs), గంజాయి(Ganja) విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. దీంతో నేరాలు ఘోరాలు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో యువత మత్తు బానిసౌ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. దీంతో నిషేధిత పదార్థాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా నిఘా పెట్టింది. గంజాయి, అసాంఘిక కార్యకలాపాలను డ్రోన్స్ ద్వారా అడ్డుకుంటోంది. అలాగే రోడ్డు పక్కన అర్ధరాత్రి ఆటోలు ఆపడంపైనా ప్రభుత్వం సీరియస్ అయింది. ఆటోల్లో మద్యం తాగడంపై యాక్షన్ తీసుకుంటోంది. కేసులు నమోదు చేస్తోంది. అయినా సరే ఏదో ఓ చోట డ్రగ్స్, గంజాయి వినియోగం కలకలం రేపుతోంది. మత్తులో కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. తద్వారా ప్రతినిత్యం ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి.

దీంతో ఈ ఘటనలపై సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. డ్రగ్స్, గంజాయి వినియోగిస్తే తాటతీయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఈ రోజు మరో సారి ప్రస్తావించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గంజాయి, డ్రగ్స్ సమాజానికి చాలా ప్రమాదకరమని చెప్పారు. గత ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిందన్నారు. ఇకపై రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాటే వినిపించకూడదని ఆదేశించారు. ఎవరైనా చట్టానికి విరుద్ధానికి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి విక్రయించినా, కొనుగోలు చేసినా తాట తీస్తామని హెచ్చరించారు. అవినీతి లేని పాలన సాగించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. పింఛన్ల కోసం ఎవరైనా లంచం అడిగితే వాళ్ల ఉద్యోగం ఊడిపోయినట్లేనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Next Story