అమరావతిపై గెజిట్ విడుదల..సీఎం చంద్ర‌బాబు ఎమోష‌న‌ల్ ట్వీట్

by velandi.Saikiran |

అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన క్రమంలోనే చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అమరావతిపై గెజిట్ విడుదల..సీఎం చంద్ర‌బాబు ఎమోష‌న‌ల్ ట్వీట్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతుల విజయమని ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వానికి, ఈ అమరావతి బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్లమెంట్ సభ్యులందరికీ, ఇతర నాయకులు, ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ పోస్ట్ పెట్టారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంపై రాయలసీమ వాసుల కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం, రాష్ట్ర ప్రజల ఆశలు, ఆలోచనలు, ఆకాంక్షలకు ప్రతిరూపమని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజల ఆశీస్సులతో ప్రతి పౌరుడు గౌరవించేలా ప్రజా రాజధానిని నిర్మిస్తానని అధికారిక ప్రకటన చేశారు.

Next Story