- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో క్రిమినల్స్‌కు చోటులేదు: CBN
పోలీస్ శాఖ(Police Department) ఆధ్వర్యంలో గుంటూరులో హ్యకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు(Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పోలీస్ శాఖ(Police Department) ఆధ్వర్యంలో గుంటూరులో హ్యకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు(Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో క్రిమినల్స్‌కు చోటులేదని తేల్చి చెప్పారు. రౌడీషీటర్లు, గంజాయిబ్యాచ్‌ను మాజీ CM జగన్ పరామర్శించారు. గంజాయి బ్యాచ్ కోసం శాంతిభద్రతల సమస్య సృష్టించారు. గతంలో కూడా ఇలాగే బాబాయిని చంపి నేరం నాపై వేయాలని చూశారు. పోస్ట్ మార్టం తర్వాత కూడా డ్రామా ఆడారు. దారుణంగా గొడ్డలితో నరికి చంపి గుండెపోటు అని ప్రచారం చేశారని మండిపడ్డారు. ఒకప్పుడు రౌడీల పక్కన నిలబడాలంటే రాజకీయ నాయకులు సిగ్గుపడేవాళ్లు. ఇప్పుడు రౌడీలే రాజకీయాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి ఉపేక్షించేది లేదని అన్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. రౌడీలు గొడవ చేస్తే చొక్కా పట్టుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు ఏపీ యువతకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ చేయాలని చెప్పారు. ఈనెల 30న క్వాంటమ్ వ్యాలీ సదస్సు నిర్వహించబోతున్నాం.. అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 25 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో హైటెక్‌సిటీ నిర్మించా. అతి త్వరలోనే ఏఐలో తెలుగువారి సత్తా ప్రపంచానికి చాటబోతున్నామని ప్రకటించారు. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాం.. రాష్ట్రంలో ఏదైనా విపత్తు వస్తే.. డ్రోన్ ద్వారా సాయం చేస్తున్నామని అన్నారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే.. అభివృద్ధి సాధ్యమన్నారు. అందుకే ఇక నుంచి సంఘ వ్యతిరేక శక్తుల పట్ల కఠినంగా ఉంటామని చెప్పారు.






