టెన్త్‌ పరీక్షల మూల్యాంకనంలో తప్పిదాలు.. అధికారులపై చంద్రబాబు సీరియస్

by Ajay Maddhiboyina |

10వ తరగతి పరీక్షాపత్రాల మూల్యాంకనంలో ఒకటి రెండు చోట్ల జరిగిన తప్పిదాలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రివాల్యూవేష‌న్, రీకౌంటింగ్ చేసుకున్న త‌ర‌వాత విద్యార్థుల మార్కుల్లో తేడాలు రావ‌డాన్ని సీఎం తీవ్ర త‌ప్పిదంగా ప‌రిగ‌నించారు.

టెన్త్‌ పరీక్షల మూల్యాంకనంలో తప్పిదాలు.. అధికారులపై చంద్రబాబు సీరియస్
X

దిశ‌, వెబ్ డెస్క్: 10వ తరగతి పరీక్షాపత్రాల మూల్యాంకనంలో ఒకటి రెండు చోట్ల జరిగిన తప్పిదాలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రివాల్యూవేష‌న్, రీకౌంటింగ్ చేసుకున్న త‌ర‌వాత విద్యార్థుల మార్కుల్లో తేడాలు రావ‌డాన్ని సీఎం తీవ్ర త‌ప్పిదంగా ప‌రిగ‌నించారు. న‌ష్ట‌పోయిన విద్యార్థుల‌కు ఇంట‌ర్ ప్ర‌వేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. త‌ప్పిదానికి బాధ్యుల‌పైన అధికారులు మ‌రియు సిబ్బందిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుని నివేధిక స‌మ‌ర్పించాల‌న్నారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం అవ్వ‌కుండా వ్య‌వ‌స్థాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు తీసుకురావాలని అధికారుల‌ను ఆదేశించారు.

ఇదిలా ఉంటే బాప‌ట్ల జిల్లా కొల్లూరు జ‌డ్పీ హైస్కూల్‌లో ఈమని తేజస్విని అనే విద్యార్థినికి టెన్త్ ఫలితాల్లో ఐదు సబ్జెక్టుల్లో అద్భుతమైన మార్కులు వచ్చాయి. అన్నింట్లో 100కి 90 మార్కులపైనే వచ్చాయి. కానీ సాంఘీక శాస్త్రంలో కేవలం 23 మార్కులు రావడంతో ఫెయిల్ అయ్యింది. దీంతో రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా ఆ సబ్జెక్టులో ఏకంగా 96 మార్కులు వచ్చాయి. విద్యార్థినికి వచ్చిన మొత్తం మార్కులు 575.. అయినప్పటికీ ముందు ఫెయిల్ అవ్వడం వల్ల విద్యార్థిని ట్రిబుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోలేకపోయింది. దీంతో ట్రిబుల్ ఐటీలో చేరే అవకాశం మిస్ అయ్యింది. ఈ వార్త ఏపీలో సంచలనంగా మారడంతో సీఎం చంద్రబాబు సైతం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story