ఆ కుటుంబాలను ఆదుకుంటాం.. సీఎం చంద్రబాబు భరోసా

by Vemula.Srinu Prasad |

పల్నాడు జిల్లా ముప్పాళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు..

ఆ కుటుంబాలను ఆదుకుంటాం.. సీఎం చంద్రబాబు భరోసా
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా ముప్పాళ్ల(Muppalla)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్(Tractor) బోల్తా పడింది. గంగమ్మ, సామ్రాజ్యం, మాధవి, పద్మ అనే నలుగురు మహిళలు మృతి చెందారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు( CM Chandrababu) స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు మహిళలు మృత్యువాత పడటం తీవ్ర విచారకరమని, ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.

Next Story