- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరు ‘సరస్’లో సీఎం చంద్రబాబు.. 300 స్టాళ్ల పరిశీలన
గుంటూరు శివారులో నిర్వహించిన సరస్ మేళాలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు..

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు(Guntur) శివారులో నిర్వహించిన సరస్ మేళా(Saras Mela)లో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన 300 స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఉత్పత్తులు ప్రదర్శిస్తున్న మహిళలతో చంద్రబాబు మాట్లాడారు. ఉత్పత్తుల తయారీ, విలువ వంటి వాటిపై అడిగి తెలుసుకుననారు. మార్కెటింగ్ సదుపాయాలపైనా ఆరా తీశారు.
మరో పది రోజుల పాటు సరస్
ఇక అంతర్జాతీయ స్థాయిలో ఈ సరస్ మేళాను మరో పదిరోజుల పాటు నిర్వహించనున్నారు. గుంటూరు శివారులోని నరసరావుపేట రోడ్డులో ఈ సరస్ మేళాను ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర డ్వాక్రా సంఘాలకు 150, వివిధ వారికి 150 స్టాళ్లను కేటాయించారు. అందరినీ ఆకట్టుకునే సరస్ ప్రదర్శన జరుగుతోంది. గుంటూరు మిరపకాయనే మస్కట్‌గా ఎంపిక చేశారు. ఈ పది రోజుల పాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఫుడ్ కోర్టులు, చిన్నారుల పార్కులను సైతం ఏర్పాటు చేశారు. చేనేత, హస్తకళలు, చీరలు, తివాచీలు, దుప్పట్లు, వెదురు, లోహ, ఆభరణాలు, గృహాలంకరణ వస్తువులు, గాజు ఉత్పత్తులు, సంప్రదాయ, సేంద్రియ ఆహార పదార్థాలు వంటివి ఈ సరస్‌లో పదర్శిస్తున్నారు.






