- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు విశాఖకు సీఎం చంద్రబాబు.. 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన
విశాఖను ఐటీ హబ్‌గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేయబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: విశాఖను ఐటీ హబ్‌గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేయబోతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. అక్కడ మదురవాడ, రుషికొండ ఐటీ జోన్ ప్రాంతాల్లో 9 ఐటీ కంపెనీలకు, వాటి సంబంధిత యూనిట్లకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఏపీఐఐసీ ద్వారా కేటాయించిన 69.97 ఎకరాల భూముల్లో ఈ ఐటీ కంపెనీలకు బీజం పడనుంది.
అక్కడ భూమి ధర ఎకరానికి కనీసం గరిష్ఠంగా రూ.4 కోట్ల వరకు ఉంది. తాజగా పరిణామంతో యువతకు సుమారు 41,967 ఉద్యోగాలు రానున్నాయి. సీఎం చంద్రబాబు ప్రారంభించబోయే ఐటీ కంపెనీల్లో కోగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సామ్వర్ధన మోథర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇమాజినోవేట్ టెక్‌సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లూయెంట్‌గ్రిడ్ లిమిటెడ్, శ్రీ టెక్ తమ్మినా, నాన్‌రెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏసీఎన్ హెల్త్‌కేర్ RCM సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి.






