ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు.. దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు

by Naga Rani Yarlagadda |

ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు.. దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ -2026లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీని ఏఐ క్వాంటమ్ హబ్ గా మార్చే దిశగా ప్రణాళికలు రచించారు. ఐబీఎం, ఐఐటీ మద్రాస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో ఏడు కీలక అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేసి.. దానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావడమే ఈ ఒప్పందాల ప్రధాన ఉద్దేశం.

1. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (UANICC)తో రాష్ట్రప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఈ ఏడాది చివరికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కానుంది.

2. ప్రపంచ టెక్ దిగ్గజంగా పేరుగాంచి ఐబీఎంతో కుదుర్చుకున్న ఒప్పందంతో రాష్ట్రంలో లక్షమంది యువతకు క్వాంటమ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

3. సౌత్ ఇండియాలో తొలి ఏఐ, క్వాంటమ్ డీమ్డ్ యూనివర్సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీతో సీఎం ఒప్పందం కుదుర్చుకున్నారు. అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్ లో జాతీయ హబ్ గా మార్చడం దీని లక్ష్యం.

4. భారత్ జెన్-నెక్స్ జెన్-ఐబీఎంలతో మరో ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రస్థాయిలో ఐదంచెల స్వదేశీ ఏఐ స్టాక్ ను నిర్మించడం ఈ ఒప్పందం లక్ష్యం. ఇది 22 భారతీయ భాషలను అనుసంధానించే వేదికగా పనిచేయనుంది.

5. కాలిబో ఏఐ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంతో రాష్ట్రంలో 50 ఉన్నత విద్యాసంస్థల్లో ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ బలోపేతం కానుంది. విద్యార్థులు, ఫ్యాకల్టీకి ఏఐ అకాడమీ, ఏఐ శాండ్ బాక్స్, ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

6. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో యూఎన్ఐసీసీ ఏర్పాటు చేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాకుండా.. మరో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు వైజర్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది చివరికి మూడున్నర లక్షల మందికి, 2027 నాటికి ఆరు లక్షల మందికి ఏఐ-క్వాంటమ్ రంగాల్లో శిక్షణ ఇవ్వడమే వైజర్ సంస్థ ప్రధాన లక్ష్యం

7. ఐఐటీ మద్రాస్ తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంతో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థుల కోసం ఏఐ ఆధారిత ట్యూటర్ అందుబాటులోకి రానుంది. విద్యార్థుల చదువు సామర్థ్యాన్ని పెంచడమే దీని లక్ష్యం.

Next Story