రాయసీమలకు మరిన్ని వరాలు.. హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎం కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-17 10:56:08  IST  )

రాయలసీమకు సీఎం చంద్రబాబు నాయుడు మరిన్ని వరాలు కురిపించారు......

రాయసీమలకు మరిన్ని వరాలు.. హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎం కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ(Rayalaseema)కు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) మరిన్ని వరాలు కురిపించారు. నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్‌లో మోటార్లు ఆన్ చేసి హంద్రీనీవా(Handreeniva) ద్వారా రాయలసీమకు కృష్ణా నీటిని(Krishna Water) రైతులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నారా లోకేశ్(Nara Lokesh) పాదయాత్ర చేసిన సమయంలో రాయలసీమపై డిక్లరేషన్ ఇచ్చారని, తాజాగా అమలు చేస్తున్నామన్నారు. రాయలసీమ జిల్లాల్లో ప్రముఖ కంపెనీలను ప్రారంభిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీని ప్రారంభించబోతున్నామన్నారు. కర్నూల్లో హైకోర్టు బెంచ్(High Court Bench) తెస్తామని సీఎం తెలిపారు. కడపలో రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీని తెస్తామని, అలాగే దాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సర్వమంగళపాడు లిఫ్ట్ కావాలని స్థానిక ఎమ్మెల్యే అడిగారని, ఇందుకు రూ. 60 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. .మోడల్ స్కూల్ ఇస్తున్నామని, ఆస్పత్రిని సైతం ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. కంపెనీలు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని, కానీ గతంలో ఉన్న భూతం మళ్లీ వస్తే మా పరిస్థితేంటీ అని అడుగుతున్నారన్నారు. ఆ భూతాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని చెబుతున్నామన్నారు. .. ప్రజలు కూడా తన మాటను నిలబెట్టాలని పిలుపునిచ్చారు.


‘‘కులం తిండి పెడుతుందా అని ఆలోచించాలి. మతం అనేది ఓ విశ్వాసం. ప్రజల జీవితాలను మార్చేది రాజకీయాలు.గత ఐదేళ్లు ప్రజలు బిక్కు బిక్కుమంటూ భయంగా బతికారు. నేను అభివృద్ధి యజ్ఞం చేస్తున్నా.. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. కొందరు రాక్షసులు నేను చేసే యజ్ఞ ఫలాలు అందకుండా చేస్తున్నారు.’’ అని సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story