- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్తరకాశీ విపత్తుపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఉత్తరకాశీలో సంభవించిన ఆకస్మిక వరదకు ధరాలీ అనే గ్రామమంతా తుడిచి పెట్టుకుపోయిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరకాశీలో సంభవించిన ఆకస్మిక వరదకు ధరాలీ అనే గ్రామమంతా తుడిచి పెట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ విపత్తుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వరదల్లో అనేక మంది గల్లంతవ్వగా.. నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ విపత్తుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరకాశీ వరద దృశ్యాలు తననెంతో కలచి వేశాయన్నారు. వరదలలో పలువురు మరణించారని తెలిసి ఎంతో బాధపడ్డానన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, వరదల్లో గల్లంతైన వారు సురక్షితంగా రావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
కాగా.. సీఎం చంద్రబాబు నాయుడి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సుమారు 10కి పైగా అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ముఖ్యంగా శ్రీ శక్తి పేరుతో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 2024-29పై కూడా చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.






