- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేం అప్పుడే చెప్పాం.. విశాఖ కేపిటల్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
విశాఖ ఆర్థిక రాజధాని అని సమైక్య రాష్ట్రంలోనే చెప్పామని సీఎం చంద్రబాబు తెలిపారు....

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఆర్థిక రాజధాని అని, ఈ విషయాన్ని సమైక్య రాష్ట్రంలోనే చెప్పామని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోందని, రూ. 8 లక్షల 87 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని పునర్మిస్తామని అధికారంలోకి రాకముందు చెప్పామని, ఇప్పుడు చేసి చూపిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులతో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. టూరిజం పరంగా విశాఖ చాలా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. దుబాయ్, సింగపూర్ మాదిరిగా విశాఖ డెవలప్‌మెంట్ కావాలని కోరుకున్నారు. ఇది ఆరంభం మాత్రమే.. సాధించాల్సింది చాలా ఉందన్నారు. నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ 2047 నాటికి మారుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. తన విజన్ 2020 ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. అభివృద్ధి పోటీల్లో తాము ఎప్పుడూ ముందు వరుసలో ఉంటామని చంద్రబాబు పేర్కొన్నారు.






