ఏపీకి చంద్రబాబు గుడ్ న్యూస్.. త్వరలో..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-19 15:12:32  IST  )

త్వరలో ఏఐ హబ్‌గా రాష్ట్రం కాబోతోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు....

ఏపీకి చంద్రబాబు గుడ్ న్యూస్.. త్వరలో..!
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలో ఏఐ హబ్‌గా రాష్ట్రం కాబోతోందని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి విజయవాడ పున్నమిఘాట్(Vijayawada PunnamiGhat) వద్ద నిర్వహించిన దీపావళి(Diwali) వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు. 15 నెలల్లోనే ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చామన్నారు. అమరావతి(Amaravati) పనులు కూడా నిర్విరామంగా సాగుతున్నాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చామని తెలిపారు. ప్రజలు, ప్రభుత్వం, ఉద్యోగులు, అందరూ కలిస్తేనే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

‘‘ప్రతి ఒక్కరికీ ఆదాయం రావాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కేంద్రం కూడా సహకరిస్తోంది. జీఎస్టీ(GST) రిఫామ్స్ తీసుకొచ్చాం. ఇలాంటి ఇంకా రావాల్సిన అవసరం ఉంది. పీ4 విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. విజయవాడ వాసులు ప్రపంచంలో చాలా చోట్ల రాణిస్తున్నారు. వారంతా పీ4ను బాధ్యతగా స్వీకరించాలి. 2047కు తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని సంకల్పిస్తున్నా. తప్పకుండా సాధ్యమవుతుంది.’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story