గాలి ముద్దు కృష్ణమ చివరి శ్వాస వరకూ ఆదర్శంగా పని చేశారు: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు చివరి శ్వాస వరకూ ఆదర్శంగా పని చేశారని సీఎం చంద్రబాబు అన్నారు...

గాలి ముద్దు కృష్ణమ చివరి శ్వాస వరకూ ఆదర్శంగా పని చేశారు: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు(Gali Muddu Krishnamanayudu) చివరి శ్వాస వదిలే వరకూ ఆదర్శంగా పని చేశారని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. చిత్తూరు జిల్లా(Chittoor District) నగరి(Nagari)లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’(Swarnandra-Swachandra) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గాలి ముద్దు కృష్ణమ నాయుడు చేసిన సేవలను గుర్తు చేశారు. ముద్దు కృష్ణమనాయుడిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన కుమారుడు భాను మరింత మెరుగ్గా సేవలందించాలని సూచించారు. గాలి భాను సమర్థవంతంగా పని చేస్తారని తాను విశ్వసిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. పోయిన ఏడాదిలో ప్రారంభించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా సాగుతోందన్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని, ప్రజల జీవన విధానం కావాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story