తుపానుపై బిగ్ అలర్ట్.. సీఎం చంద్రబాబు కీలక విజ్ఞప్తి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-27 09:17:40  IST  )

రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు..

తుపానుపై బిగ్ అలర్ట్.. సీఎం చంద్రబాబు కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంపై మొంథా తుపాను(Montha Tupan) ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నామని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) తెలిపారు. తుపాను ప్రభావం(Cyclone Effect)పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు చంద్రబాబు మాట్లాడుతూ తుపానుతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. తుఫాన్ వల్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ సమాచారం అందించి అప్రమత్తం ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారు.

సముద్రతీర ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే పునరావాసం కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ బలగాలను మోహరించామన్నారు. విద్యుత్ సరఫరా, రహదారుల మరమ్మతులు, డ్రెయిన్ల పునరుద్ధరణ, విరిగిపడ్డ చెట్లను తొలగించేలా యంత్రాలతో బృందాలను అందుబాటులో ఉంచామని చంద్రబాబు తెలిపారు తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ(Pm Narendra Modi) ఫోన్ చేసి మాట్లాడారన్నారు. రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు. ప్రజలు అంతా ప్రభుత్వ సూచనలు పాటించాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు.

Next Story