మన రైతులను చూసి నేను గర్వపడుతున్నా: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర రైతులను చూసి తాను గర్వపడుతున్నానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని ఉండవల్లిలో బిల్ గేట్స్‌తో కలిసి అరటి తోటలను ఆయన పరిశీలించారు...

మన రైతులను చూసి నేను గర్వపడుతున్నా: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర రైతులను చూసి తాను గర్వపడుతున్నానని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. అమరావతి(Amaravati)లోని ఉండవల్లిలో బిల్ గేట్స్‌(Bill Gates)తో కలిసి అరటి తోటలను ఆయన పరిశీలించారు. అనంతరం ఎక్స్‌లో చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘‘మన సంప్రదాయాలను గౌరవిస్తూనే సాంకేతికతను అవలంబించడంలో రైతులు ముందంజలో ఉన్నారు. ఉండవల్లిలో మిస్టర్ గేట్స్‌తో కలిసి అరటి తోటల(Banana Plantations)ను పరిశీలించాం. ఇందుకు సంబంధించిన ఫోటోను ప్రజలతో పంచుకుంటున్నా. అమరావతికి వచ్చిన బిల్ గేట్స్‌కు సాంప్రదాయ స్వాగతం లభించింది. ఆ తర్వాత వ్యవసాయంలో డ్రోన్‌ల వాడకంపై ప్రదర్శన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతుల పంటలు, మార్కెట్ ధరలు, నేల పరిస్థితుల ఆధారంగా AI ఖచ్చితమైన సలహాలను అందిస్తోంది. మేం సహజ వ్యవసాయం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను కూడా చురుకుగా ప్రోత్సహిస్తున్నాం.’’ అని బిల్ గేట్స్‌కు చెప్పినట్లు సీఎం చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story