కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

by Ramesh Naini |

గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా పరస్పర అభివాదాలు జరిపి, రాష్ట్రాభివృద్ధి అంశాలపై స్వల్పంగా చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా విమానాశ్రయంలో అధికార పార్టీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

Next Story