- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీరు మార్చుకోండి.. మంత్రులపై సీఎం చంద్రబాబు ఫైర్
మంత్రులపై సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ...

దిశ, వెబ్ డెస్క్: మంత్రులపై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌వోడీల కార్యదర్శులతో అమరావతిలో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పని తీరు మార్చుకోవాలని మంత్రులకు సూచించారు. ఢిల్లీ(Delhi)కి అధికారులతో మంత్రులు కలిసి వెళ్తే సంబంధిత పథకాలకు కేంద్రం నిధులు వస్తాయని దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో మంత్రులు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అధికారుల తీరుపైనా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు అధికారులు ఒక్కో ఫైల్‌కు 18 రోజులు తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎస్పీఎఫ్ చీఫ్ త్రివిక్రమ్ వర్మ(SPF Chief Trivikram Verma) పని తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం పని చేస్తుందనే బలమైన భావన ప్రజల్లో కల్పించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.






